నవరాత్రుల్లో నాలుగో రోజు నుంచి ఆరో రోజు వరకూ ఉండే రజో గుణము గురించి, అది మనకు ముక్తిని ఇచ్చే ప్రక్రియగా ఎలా అవుతుందనే దాని గురించి సద్గురు మనకు వివరిస్తారు.


Sadhguruమన శరీర నిర్మాణంలో లోతుగా అనుబంధం ఉన్న మూడు గ్రహాలు – భూమి, సూర్యుడు, చంద్రుడు – వీటిలో భూమి తమో గుణం కలిగింది. సూర్యుడిది రజో గుణం. చంద్రుడుది సత్వ గుణం. ఈ భూమి స్వభావం, మీ పుట్టుక స్వభావం కూడా తమో గుణమే. ఇక బయటకి వచ్చి, మీరు పని చేయటం మొదలు పెట్టిన క్షణం రజోగుణం మొదలవుతుంది. ఒక సారి రజో గుణం రాగానే మీరు ఎదో ఒకటి చేయాలనుకుంటారు. మీరు ఎదో ఒకటి చేయటం మొదలు పెట్టినప్పుడు మీకు అవగాహన, వివేకం లేకపోతే సమస్యే. రజో గుణ స్వభావం ఎలా ఉంటుందంటే, అది బావున్నంత వరకూ బావుంటుంది. అది మొండికేయడం ఒకసారి మొదలు పెడితే రజో గుణం ఎంతో చెడ్డది.

మీరు చేసే ఏపనైనా అది మీ ముక్తికైనా దారితీస్తుంది లేక ఇంకా చిక్కుకుపోయే బంధనగా ఉంటుంది.

రజో గుణం ఉన్న వ్యక్తికి బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది. దాన్ని మనం సరైన దారిలో పెట్టడం ముఖ్యం. మీరు చేసే ఏపనైనా అది మీ ముక్తికైనా దారితీస్తుంది లేక ఇంకా చిక్కుకుపోయే బంధనగా ఉంటుంది. మీరు సంపూర్ణమైన సుముఖతతో ఏ పని చేసినా అది ఎంతో అందంగా, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఏ కారణం వల్లనైనా కానీ, మీరు ఏదైనా ఇష్టం లేకుండా చేస్తే, అది మీకు బాధను కలిగిస్తుంది. మీరు ఏమి చేసినా, కేవలం నేలను ఊడ్చినా మీరు దాన్ని ఇష్టపూర్వకంగా, పూర్తిగా నిమగ్నమై చేయండి, అదే ముఖ్యం. మీరు దేనితోనైనా ప్రేమతో కలిసిపోతే ఇక వేరేది ఏది మీ అనుభవంలో ఉండదు. ప్రేమ అంటే “స్త్రీ-పురుషుల” మధ్య ప్రేమ అని మాత్రమే అర్ధం కాదు. ప్రేమ అంటే దేనిపైనైనా చెక్కుచెదరని సంలగ్నత. అది ఏదైనా కావచ్చు – మీరు పాడవచ్చు, డాన్స్ చేయచ్చు లేక కేవలం నడవవచ్చు. మీరు ఏది చేస్తున్నారో అది ఎంతో ప్రేమతో చేయండి. మీ శ్వాసను ప్రేమతో పీల్చండి, ప్రేమతో నడవండి, ప్రేమతో జీవించండి. మీ మనుగడే సృష్టిలోని ప్రతీ దానితో పరి పూర్ణంగా సంలగ్నమై ఉంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు