మనుషులు తమ స్వభావరీత్యానే ఆనందంగా ఉంటే, మతం అనేదేది ఉండదు. ప్రపంచంలోని ఈ భాగంలో ఒకప్పుడు అది వాస్తవమే. ఒకప్పుడు ఇక్కడ ఏ మతమూ లేదు, ఉన్నది కేవలం సంస్కృతే.

హిందువులకి మత నియమాలేవి లేవు. ఆ తర్వాత కాలంలో, బయటి నుంచి పోటీ మొదలయినప్పుడు, వారు కూడా ఇదంతా మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం సంస్కృతి, వివిధ జీవన విధానాలు ఉండేవి. మీరు ఇలా జీవిస్తే ఇలా ఉంటుంది, అలా జీవిస్తే అలా ఉంటుంది అనే అవగాహన అందరిలో ఉండేది.

నేడు మనకు తెలిసిన క్రిస్టియానిటీ లేదా ఇస్లాంల లాగా, అప్పుడు సరైన మతం అంటూ ఏది లేదు. మనుషులు నిజంగా ఆనందంగా ఉంటే, వారిలో బాధ అనే భావన లేకపోతే, సిగ్గు అనే భావన లేకపోతే, అపరాధము అనే భావన లేకపోతే, భయం అన్న భావన లేకపోతే, ప్రపంచంలోని చర్చులలో, గుళ్ళలో, మసీదులలో ఎంత మందిని చూస్తామని మీరనుకుంటున్నారు?

మానవులు నిజంగా, నిజంగా ఆనందంగా ఉంటే, మతానికి అస్థిత్వమే ఉండదు.  

అప్పుడు కేవలం జ్ఞానసిద్ధి పొందినవారు మాత్రమే గుళ్ళలో నివసిస్తారు. ఇప్పుడు జ్ఞానసిద్ధి పొందినవారు గుళ్ళ దగ్గరికి కూడా వెళ్లట్లేదు. ఎందుకంటే అక్కడకి అతి అత్యంత బాధలో ఉన్నవాళ్ళు మాత్రమే వస్తూ ఉన్నారు. కాబట్టి మానవులు నిజంగా, నిజంగా ఆనందంగా ఉంటే, మతానికి అస్థిత్వమే ఉండదు. అప్పుడు అసలు మతము యొక్క అవసరమే తొలిగిపోతుంది.

మతం సున్నితంగా చెప్పినా లేదా మొరటుగా చెప్పినా, మొత్తానికి అది చెప్పేది ఒక్కటే. అది చెప్పేది మీరు ఒక విధానాన్ని అనుసరిస్తే, ఒక నీతి మార్గంలో వెళితే లేదా కొన్ని మార్గానిర్దేశాలను అనుసరిస్తే, మీరు స్వర్గానికి వెళ్లి అక్కడ ఆనందంగా ఉంటారనే. మీరు ఇక్కడే ఆనందంగా ఉంటే, మీరు స్వర్గంలో ఉన్నట్లే. అప్పుడు, ఎక్కడికో వెళ్ళాలన్న కోరిక మీలో నుండి పూర్తిగా మాయమైపోతుంది. అప్పుడు మీ జీవితపు ప్రగాఢ పార్శ్వాలు తమంతట తాము బయటకి వ్యక్తమవుతాయి. ఎందుకంటే ఒక విధంగా ఉండాలనే మీ కోరిక మాయమైపోయింది. అప్పుడు, సృష్టిలోని సహజ శక్తులు మీలో పూర్తిగా భిన్నంగా పని చేస్తాయి.

కనుక, ప్రస్తుతం ప్రపంచంలో ‘మతం’ అని మీకు మామూలుగా ఏదైతే తెలుసో, అది ఆనందంగా ఉండటం కోసం చేసే ఒక ప్రయత్నం మాత్రమే. కాకపోతే అది ఆనందం కోసం చేసే అతి బాధాకరమైన ప్రయత్నం.

మీరు ప్రార్థనలో ఏదైనా కొంత ఆనందాన్ని పొందితే, అది కూడా నిలబడదు. ఈ విషయం మీరు తెసుకోవాలని నేను ఆశిస్తున్నాను. 

ఆనందం ఒక మతం కాదు. ఆనందం అన్ని మతాల లక్ష్యం. మీరు లక్ష్యాన్ని చేరుకుంటే మీకు ఇక వాహనం ఎందుకు? మీరు గమ్యాన్ని చేరుకుంటే, మీరు ఇంకా వాహనంలోనే ఎందుకు కూర్చుని ఉంటారు? సహజంగానే మీరు దాంట్లో నుండి కిందికి దిగుతారు, అవునా, కాదా?

మీకు తెలిసిన ఆనందం నిలబడదు. చూడండి, ప్రస్తుతం మీరు పెళ్లి చేసుకోవడం ఆనందం అనుకుంటారు, ఒక బిడ్డను కనటం ఆనందం అనుకుంటారు, ఉద్యోగం రావడం ఆనందమనుకుంటారు, ప్రమోషన్‌ రావడం ఆనందమనుకుంటారు. ఇవి అన్నీ ఖచ్చితంగా నిలబడే ఆనందాలు కావు. ఒక స్ధాయిలో మీరు దీనిని ఆనందమని అంటే, సరే. నేను ఆ స్ధాయి ఆనందం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే అది ఎప్పటికీ నిలబడదు, అది పడిపోతూనే ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిది.

మీరు ప్రార్థనలో ఏదైనా కొంత ఆనందాన్ని పొందితే, అది కూడా నిలబడదు. ఈ విషయం మీరు తెసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీకు మద్యం వల్ల ఏదైనా కొంత ఆనందం కలిగితే, అది కూడా నిలబడదు. కాని ఒక విషయం ఏమిటంటే మద్యం తాగితే, దానివల్ల కలిగే దుష్ప్రభావాలను మీరు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది.

మీరు అతిగా ప్రార్ధన చేస్తే, మీ చట్టూ ఒక కాంతి వలయం ఏర్పడవచ్చు. అది మీ తల చుట్టూ బిగుసుకు పోయి, మీకు తలనెప్పి కలిగించవచ్చు. ఇది మీకు అర్థం కాకపోతే పర్వాలేదు, నిజంగా పర్వాలేదు. మందమతులు మామూలు వారి కన్నా ఎక్కువ ఆనందంగా ఉంటారు.

మనుషులు తమ స్వభావరీత్యానే ఆనందంగా ఉంటే, అప్పుడు మతం అనేదేది ఉండదు.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.