శక్తినాడులకు భౌతికమైన అభివ్యక్తీకరణ లేదు. మీరు మీ శరీరాన్ని కోసి చూస్తే మీకు అవి కనిపించవు. కానీ మీలో ఎరుక పెరిగే కొద్దీ మీ శక్తి విచ్చలవిడిగా కాకుండా కొన్ని ఏర్పాటు చేసుకున్న మార్గాల్లో కదులుతుంది. చక్రాలు మీ శరీరంలో ఎంతో శక్తివంతమైన కేంద్రాలు. ఇక్కడ మీ నాడులు కలిసి ఒక ప్రత్యేకమైన విధానంలో శక్తి చక్రవాతాలను సృష్టిస్తుంది. నాడులలాగానే ఈ చక్రాలు కూడా సూక్ష్మ స్వభావం కలిగినవి, వీటికి భౌతిక అస్థిత్వం లేదు. అవి ఎప్పుడూ ఒక త్రికోణాకారంలో (గుండ్రంగా కాదు) కలుస్తాయి కాని మనం వాటిని చక్రాలు అని అంటాము ఎందుకంటే అవి కదలికను, క్రియాశీలతను సూచిస్తాయి. ‘చక్ర’ అంటే ఒక ‘చక్రం’ అని అర్ధం. ఒక మెషిన్ లోని కదిలే భాగం ఎప్పుడూ గుండ్రంగానే ఉంటుంది ఎందుకంటే గుండ్రంగా ఉంటడం వల్ల అది తక్కువ నిరోధ శక్తితో కదలగలదు.

 ఒక మెషిన్ లోని కదిలే భాగం ఎప్పుడూ గుండ్రంగానే ఉంటుంది ఎందుకంటే గుండ్రంగా ఉంటడం వల్ల అది తక్కువ నిరోధ శక్తితో కదలగలదు.

మీ శరీరంలో 114 చక్రాలు ఉన్నాయి కానీ సాధారణంగా మనం ఏడు పార్శ్వాలను సూచించే ఏడు చక్రాల గురించి మాట్లాడతాము. ఈ ఏడు ప్రాధమిక చక్రాలు : మూలాధార – ఇది మీ మల మార్గము మరియు మర్మావయవాల మధ్య ఉన్న స్థలంలో ఉంటుంది; స్వాధిష్టాన – ఇది మీ మర్మవయవాలకు కొద్దిగా పైన ఉంటుంది; మణిపూరక – ఇది మీ బొడ్డుకు కొంచం కింద ఉంటుంది; అనహత – ఇది మీ పక్కటెముకల మధ్యలో ఉంటుంది; విశుద్ధి – ఇది గొంతు గుంటలో ఉంటుంది; ఆజ్ఞ – ఇది మీ కనుబొమ్మల మధ్యలో ఉంటుంది; సహస్రార – దీన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు, ఇది మీ నడినెత్తిలో ఉంటుంది (శిశువులకు మాడు మీద ఉండే మెత్తటి భాగం).

మీ ఆజ్ఞలో శక్తులు ప్రబలంగా ఉంటే మీరు జ్ఞాన సాక్షాత్కారం పొందిన వాళ్ళు అవుతారు.

మీలో కలిగే అనుభూతులు – కోపం, బాధ, శక్తి, ఆనందం, పరమానందం – ఇవన్నీ మీ జీవ శక్తుల యొక్క వివిధ స్థాయిల వ్యక్తీకరణలే. ఈ ఏడు చక్రాల వద్ద మీ శక్తి ఏడు వివిధ పార్శ్వాలలో అభివక్తం అవుతుంది. ఈ శక్తి మూలాధారాలో ప్రబలంగా ఉంటే అప్పుడు ఆహరం, నిద్ర అనేవి మీ జీవితంలో ప్రబలమైన అంశాలుగా ఉంటాయి. మీ శక్తి స్వాధిష్టానలో ప్రబలంగా ఉంటే మీ జీవితంలో ఆహ్లాదం అనేది ఎక్కువ ప్రబలంగా ఉంటుంది. మీ శక్తి మణిపూరకలో ప్రబలంగా ఉంటే మీరు కార్యదక్షులు అవుతారు, మీరు ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తారు. మీ శక్తి అనహతలో ప్రబలంగా ఉంటే మీరు సృజనాత్మకమైన వారు అవుతారు. మీ శక్తి విశుద్ధిలో ప్రబలంగా ఉంటే మీరు అత్యంత శక్తివంతులు అవుతారు. మీ ఆజ్ఞలో శక్తులు ప్రబలంగా ఉంటే మీరు జ్ఞాన సాక్షాత్కారం పొందిన వాళ్ళు అవుతారు. అనుభవపూర్వకంగా అది జరుగలేదు కానీ జ్ఞానపరంగా తెలుసుకోవటం వల్ల, బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఒక సమతుల్య స్థితికి చేరుకుంటారు.

మీరు మీ సహస్రారను తాకితే మీరు వివరించలేని పరమానంద స్థితికి చేరుకుంటారు.

ఇవన్నీ తీవ్రతలోని వివిధ స్థాయిలు. ఆహ్లాదం కోరుకునే వారి జీవితం కేవలం ఆహరం, నిద్ర గురించి మాత్రమే చూసే వారి కంటే కొంచం ఎక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏదైనా మొదలు పెట్టాలని కోరుకునేవారి జీవితం ఇంకా ఎక్కువ తీవ్రతతో ఉంటుంది. ఒక కళాకారుడు లేక సృజానాత్మకమైన వ్యక్తి ఈ ముగ్గురి కంటే ఎక్కువ తీవ్రంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. మీరు విశుద్ధిలోకి కదిలితే అది పూర్తి విభిన్నమైన తీవ్రత అయితే ఆజ్ఞ మరింత ఎక్కువ తీవ్రమైనది. మీరు మీ సహస్రారను తాకితే మీరు వివరించలేని పరమానంద స్థితికి చేరుకుంటారు. బాహ్య ఉత్ప్రేరకం కానీ, ఎలాంటి కారణం కానీ లేకుండానే మీరు పరమానందంగా ఉంటారు ఎందుకంటే మీ శక్తి ఒక శిఖరాన్ని తాకింది.

ప్రేమతో,
సద్గురు