సూర్య క్రియ – ఒక శక్తివంతమైన ప్రాచీన యోగా ప్రక్రియ!

suryakriya

మేము సూర్యుడికి సంబంధించిన ఒక సాధనను నేర్పడం మొదలుపెట్టాము. ఇది సూర్య నమస్కారం లాగానే ఉంటుంది కానీ, ‘సూర్య క్రియ’ అని పిలువబడుతుంది. ఎందుకంటే ఇందులో ఒక నిర్దిష్ట స్థాయిలో శ్వాసను గమనించడం, శక్తిని బలంగా ఉత్తేజపరచడం ఉంటాయి. మీతో సహా ఈ గ్రహం మీద ఉన్న ప్రతీ జీవి సౌర శక్తి మీదే ఆధారపడి ఉన్నది. ఈ భూమి మీద మీరు అనుభవిస్తున్నవేడి అంతా ప్రాధమికంగా సూర్యుడి నుంచి వచ్చినదే. కాకపోతే అదే వివిధ రూపాలలో నిల్వచేయబడి, వ్యక్తమౌతున్నది. మీరు ఒక చెక్క ముక్కను తీసుకుని కాలిస్తే అది సౌర శక్తినే విడుదల చేస్తుంది. సౌర శక్తిని మనం తీసేస్తే, ఈ గ్రహమంతా మంచుగా గడ్డకట్టుకుపోతుంది. ‘సూర్య నమస్కారం’ అనే పేరు కేవలం నామమాత్రమైనది కాదు. ఈ సాధన ముఖ్యంగా మీ నాభీ చక్రాన్ని (సోలార్ ప్లెక్సస్‌ను) ఉత్తేజపరిచి, మీ ‘సమత్ ప్రాణ’ని, అంటే మీ శరీర వ్యవస్థలోని సౌర తాపాన్ని ప్రేరేపిస్తుంది

సూర్య క్రియ సాధన పైకి భౌతికమైనదిగానే కనిపిస్తుంది కానీ, అందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. నిజానికి సూర్య క్రియే అసలైన సాధన. ఇది సూర్యుడితో మిమల్ని మీరు అనుసంధానం చేసుకునే మార్గం. ఇది చాలా మెరుగైన ప్రక్రియ. దీంట్లో శరీరపు అమరికపై (జామెట్రీపై) చాలా ధ్యాస పెట్టవలిసి  ఉంటుంది. నిజానికి సూర్య నమస్కారం దీనికి దూరపు చుట్టము. మీరు కండలను పెంచుకోవాలనుకుంటే, మీకు శారీరక దారుఢ్యంతో పాటు ఆధ్యాత్మికత కూడా కావాలనుకుంటే  సూర్య నమస్కారం చేయండి. అలాకాక మీరు చేసే భౌతిక ప్రక్రియలో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలనుకుంటే, అప్పుడు మీరు సూర్య క్రియ చేయండి.

మానవశరీర నిర్మాణంలో సూర్యుడు, భూమి, చంద్రులకు ముఖ్యమైన పాత్ర ఉంది. సౌర వ్యవస్థలో జరిగే మార్పులు 12¼ నుంచి 12½ సంవత్సరాలకు ఒకసారి పునరావృతమౌతాయ. మీరు వీటితో అనుసంధానమై జీవిస్తే, అది మీకు శ్రేయస్సు కలిగిస్తుంది. మీ భౌతిక శరీరంలో పునరావృతమయ్యే వాటిని  కూడా 12¼ నుంచి 12½ సంవత్సరాలకు ఒకసారి సంభవించేటట్లు చేసేందుకు సూర్య క్రియ అనేది ఒక మార్గం. మీలోపలా, బయటా ఒక రకమైన సానుకూల స్థితిని ఏర్పరచుకోవడానికి సూర్య క్రియ దోహదపడుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ జీవన ప్రక్రియకు ఎటువంటి అవరోధాన్ని గానీ, ఇబ్బందిని గానీ కలిగించవు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

 

సాంప్రదాయ హఠ యోగాని శుద్ధరూపంలో అందించాలి అనేది సద్గురు ఆశయం. అసలైన హఠ యోగాని నేర్పించే యోగా టీచర్లను తయారుచేయటం కోసం ‘ఈశా హఠ యోగా స్కూల్‌’ వారు 21 వారాల టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలకు 08300097444కి కాల్ చేయండి, లేదా  info@ishahathayoga.com కి ఈమెయిల్ చేయండి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *