‘కర్మ’ను విచ్ఛిన్నం చేయడం ఎలా?

091 -Initiation @ Base of Kailash

మన సంస్కృతిలో కర్మ అనే పదం విపరీతంగా వాడబడడం మనకు తెలిసిన విషయమే. మనలో కొంత మంది ప్రతీ దాన్ని కర్మతో ముడిపెడతారు. అసలు ఈ ‘కర్మ’ అంటే ఏమిటో, దాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి!


కర్మ అంటే పని ‘లేదా’ చర్య అని అర్ధం. ఇక్కడ మనం  గతంలో చేసిన పనులను ‘లేదా’ చర్యల గురించి మాట్లాడుతున్నాము. మీరు పుట్టిన క్షణం నుంచీ, ఈ క్షణం వరకూ, మీ కుటుంబ స్థితిగతులు, మీ ఇంటి వాతావరణం, మీ స్నేహితుల మనస్తత్వాలు, మీరు చేసిన- చెయ్యని పనులు, ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతీ ఆలోచన, ప్రతీ ఉద్వేగం, ప్రతీ చర్యా, మీలో గతంలో ముద్రింపబడి  ఉన్న భావనల నుండే జనిస్తుంది. అవన్నీ ఇప్పుడు మీరు ఎవరూ అనేది నిర్ణయిస్తాయి. మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం, అసలు జీవితాన్ని అర్థం చేసుకొనే విధానమే మీరు ఇంతకు ముందు స్వీకరించిన వాటిని ఎలా మీలో ఇమడ్చుకున్నారనే దానిని బట్టి ఉంటుంది. దీనినే మనం కర్మ అంటాము.

ప్రస్తుతం ఏ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఐతే మీరు పని చేస్తున్నారో అదే మీ కర్మ.

ఆధునిక భాషలో చెప్పాలి అంటే, అది మీలోని సాఫ్ట్‌వేర్. ప్రస్తుతం ఏ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఐతే మీరు పని చేస్తున్నారో అదే మీ కర్మ. మీ శారీరక వ్యవస్థ అంతా, అంటే మీ దేహం, బుద్ధి, శక్తి, భావోద్వేగాలు, అన్నీ ముందుగానే, మీరు స్వీకరించిన వాటి ఫలితంగా  ప్రోగ్రామై ఉన్నాయి. వాటన్నిటి సంక్లిష్ట సమ్మేళనమే మీ కర్మ. మీలోని సాఫ్ట్‌వేర్ ఏ విధంగా ఉంటే, అదే విధంగా మీ శరీరం, బుద్ధి, భావాలు పని చేస్తాయి. మీలోని అంతర్గత శక్తి కూడా అదే దిశగా ప్రవహిస్తుంది.

మీకెలాంటి కర్మ ఉన్నా, అది ఒక పరిమితమైన సంభావ్యతే(అవకాశమే). మిమ్మల్ని ఒక వ్యక్తిగా పరిమితున్ని చేసేది అదే. మీ వ్యక్తిత్వం మీ కర్మల నుండీ జనించే పరిమళం. మీ కర్మలో కుళ్ళిపోయిన చేప ఉంటే, మీరు ఆ దుర్వాసననే కలిగి ఉంటారు. మీ కర్మలో పువ్వుల సుగంధం ఉంటే, మీరు ఆ పరిమళాన్నేకలిగి ఉంటారు. మీలో ఎలాంటి భావనలు – కోపం- ద్వేషం, ప్రేమ-ఆనందం- ఇలా ఎలాంటి భావనలైతే ముద్రింపబడి  ఉన్నాయో, వాటకి అనుగుణంగానే మీకు  ఒక రకమైన  వ్యక్తిత్వం ఉంటుంది. సామాన్యంగా ప్రతీ మనిషి, వీటన్నిటి సమ్మేళనమే! మీరు మీ వంక చూసుకున్నా, మీ చుట్టూ ఉన్న మనుషులను చూసినా, ఒక సందర్భంలో వారు ఎంతో అద్భుతంగా కనిపిస్తారు,  మరొక సందర్భంలో వారే చాలా అసహ్యకరంగా కనిపిస్తారు.ఎందుకంటే ప్రతీ క్షణం, మీ కర్మలోని ఒక భాగం వ్యక్తీకరించబడుతుంది. ఈ కర్మ నిర్మాణాన్ని మీరు అలాగే జరగనిస్తే, ఒక నిర్ణీత స్థితి తరువాత, మీకు స్వేచ్చ అనేదే లేకుండా పోతుంది. మీరు చేసేదంతా కూడా జరిగిపోయిన విషయాలతో శాసించ బడినదవుతుంది! కాబట్టి, మీరు మోక్షం దిశగా ప్రయాణించాలి అంటే, మొదట చెయ్యవలసింది, కర్మ బంధనాన్ని వదులు చేసి, ఆ సంకెళ్ళను తెంచుకోవడమే! లేకపోతే, ఏ పురోగతీ  ఉండదు.

మీకు ఇష్టంలేని వాటిని మీరు సహజంగా నిరాకరిస్తారు కనుక, మీ కర్మను విచ్ఛిన్నం చేయటానికి కొంత కాలం మీకు ఇష్టం లేని వాటిని చేసి చూడండి.

కాబట్టి, ఇదంతా ఎలా చెయ్యాలి ? ఇందుకు మొదటి సులభోపాయం, శారీరకంగా కర్మను విచ్చెేదనం చెయ్యడం. ఉదయాన ఎనిమిది గంటలకు లేవడం మీ కర్మ అయినట్లయితే, మీరు ఐదు గంటలకే అలారం పెట్టుకుని లేవండి. మీ శారీరక కర్మ అందుకు అంగీకరించదు. అయినా, మీరు ‘నేను నిద్ర లేవాల్సిందే’ అని తీర్మానించుకోండి. అలా మీరు నిద్ర లేచినా, మీ శరీరం ముందుగా కాఫీ అడుగుతుంది. కాని, మీరు దానికి చన్నీళ్ళ స్నానం ఇవ్వండి. ఇలా జాగృత స్థితిలో ఉంటూ, మీరు చెయ్యడం వల్ల, మీరు గత కర్మలను తెంచగలుగుతారు.

ఏది చేయాలనిపిస్తుందో, అది కర్మ నుంచే జనిస్తుంది. మీకు ఇష్టంలేని వాటిని మీరు సహజంగా నిరాకరిస్తారు కనుక, మీ కర్మను విచ్ఛిన్నం చేయటానికి కొంత కాలం మీకు ఇష్టం లేని వాటిని చేసి చూడండి. ఇది ఒక్కటే మార్గం కాదు. ఇంకా సూక్ష్మమయిన, ప్రభావవంతమయిన పద్ధతులు ఉన్నాయి. నేను మీకు చెబుతున్నది అత్యంత మొరటు విధానం. మీ మనసు, దేహం కోరుకునే వాటినన్నిటినీ తెంచుకోండి. మీకు ఇష్టం లేనివి ఎరుక(awareness)తోనే చేయగలరు. మీకు ఇష్టం ఉన్నవి మీరు పరాకుగా అయినా చెయ్యగలరు. అవునా, కాదా?

ఒకవేళ మీరు మీ శత్రువుతో మాట్లాడాలి అనుకోండి. అప్పుడు మీరు ప్రతీ మాట ఆచి-తూచి , ప్రతీ అడుగూ ఆలోచించి వేస్తారు. కాని, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నోటికి వచ్చిందల్లా ఆలోచించకుండానే మాట్లాడేస్తారు. మీ శత్రువును మీరు సహించలేరు. అతన్ని చూడగానే, మీలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అయినా, మీరు వెళ్లి అతనితో మాట్లాడండి. కర్మ విచ్ఛేదనానికి ఇదొక మార్గం. ఇలా జాగృతస్థితిలో ఉంటూ, మీకు ఇష్టం లేని పనులను చెయ్యడం వల్ల, మీరు మీ కర్మ బంధనాలను క్రమంగా తెంచుకోగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert  • Jaya

    muDha jahI hi-dha nA-gama-triSnAM
    kuru sad-bhuDDhiM manasi vi-triSnAM
    yalla-bhasE nija karmO pATTaM
    viTTaM tEna vinOdaya chiTTaM BHAJE GOVINDHAM BHAJE GOVINDHAM I BOW DOWN