జీవితంలోని ప్రతి విషయం మనకు నచ్చిన విధంగానే జరగాలని కోరుకుంటాము. ఐతే, మిగితా వారు కూడా ఇలనే  లోచిస్తారు కదా...అందరూ కోరుకునట్టు జరిగితే ప్రపంచం ఏమైపొతుంది? అయితే ఈ లోచనలకి ఎలా మార్గనిర్దేశం చేయవచ్చో సద్గురు మాటల్లో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


 

మీరు మౌలిక వాస్తవాలను అంగీకరించడం లేదు; మీ బుర్రలో జీవితం పట్ల కాల్పనిక ఆలోచనలు ఉన్నాయి. మీకు జీవాన్ని గ్రహించే శక్తి గానీ, జీవ జ్ఞానం కానీ లేవు. మీకు కేవలం అహంభావం మాత్రమే ఉంది. ఎప్పుడూ మీకుండే ఒకే ఒక సమస్య, అలాగే మీ బాధకి ప్రధాన కారణం జీవితం మీరు అనుకున్నట్లుగా జరగక పోవడమే. మీ బాధకి గల ఏకైక కారణం ఇదే, అవునా, కాదా?

 

ఎప్పుడూ మీకుండే ఒకే ఒక సమస్య, అలాగే మీ బాధకి ప్రధాన కారణం జీవితం మీరు అనుకున్నట్లుగా జరగక పోవడమే!

మీరు ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్ధితిలో, అంతా మీరు అనుకున్నట్లుగా అయితే, మీరు ఇంకా ఇక్కడ జీవిస్తూ ఉండగలరని అనుకుంటున్నారా? అంతా మీరు అనుకున్నట్లుగా అయితే, మీరు ఈ ప్రపంచంలో ఎంత గందరగోళం సృష్టించగలరో మీకు తెలుసా?

ఒక వేళ మీకూ, మిగతా వారందరికీ అంతా కావాల్సిన విధంగానే జరిగితే, అది ఎలా ఉంటుందో ఊహించగలరా? అప్పుడు ప్రపంచం నాశనమవటానికి ఏంతో సమయం పట్టదు! అదృష్టవశాత్తు, అంతా మీకు కావలసిన విధంగా జరగట్లేదు.

అదే కాక, అంతా మీకు కావాల్సిన విధంగా అయితే, నేనెక్కడికి వెళ్ళాలి?మిగతా వారందరూ ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు మనలోని ప్రతి ఒక్కరికీ వారి వారి స్వంత ప్రపంచాలు కావలసి వస్తాయి, మీరు ఇప్పుడు చేసేది అదే. మీరు ఒకే ఇంట్లో ఉంటున్నా, మీరు మీ స్వంత ప్రపంచంలో ఉంటున్నారు, మీ కుటుంబంలోని వారు వారి వారి స్వంత ప్రపంచాల్లో ఉంటున్నారు.

మీరు వాస్తవాన్ని భరించలేరు కాబట్టి, ఊహల్ని ఎంచుకున్నారు. మీరు ఊహాలోకంలో విహరించేటప్పుడు, కొన్ని సార్లు చాలా బాగున్నట్లనిపిస్తుంది. కొన్నిసార్లు బాగోలేదనిపిస్తుంది, కానీ మీ ఊహల మీద మీకే నియంత్రణ లేదు.

మీరు వాటికి కొంచం మార్గనిర్దేశం చేయవచ్చు, కాని ఊహలంటేనే వాటి మీద నిజంగా మీకేలాంటి నియంత్రణా ఉండదు. మీకు వాటి మీద నియంత్రణ ఉంటే, అవి స్పృహతో చేసిన ఆలోచనలవుతాయి. మీరు స్పృహతో చేసిన ఆలోచనల వల్ల ఎగరలేరు, మీరు వాటి వల్ల ఎల్లప్పుడూ భూమి మీదే ఉంటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.