ఏమైనా  లాభమే…

profit-and-success_1024x768

జీవితంలోని ప్రతి విషయంలో మనకు లాభమే కలగాలని, ప్రతి విషయం మనకు నచ్చిన విధంగానే జరగాలని కోరుకుంటాము. ఐతే, ఎన్నో విషయాల్లో మనకు నష్టం జరుగుతూనే ఉంది, ఎన్నో విషయాలు మనకు నచ్చిన విధంగా జరగటం లేదు. కానీ, మన జీవితంలో ఏమి జరిగినా సరే మనం లాభంలోనే ఉంటామని సద్గురు చెప్తునారు. మరి అది ఎలా సాధ్యమో, ఆయన మాటల్లోని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


మీరు కష్టపడి పని చేసి ప్రపంచంలోని డబ్బంతా పొందిన తరువాత, సెలవులో వెళ్ళాలనుకుంటారు లేదా బీచులో హాయిగా పడుకోవాలనుకుంటారు లేదా అడవుల్లో నడవాలనుకుంటారు లేదా మర్నాడు ఉదయం నిద్ర లేచి ఆఫీసుకి వెళ్ళనవసరం లేకుండా, ఏ చీకూ చింత లేకుండా ఉండాలనుకుంటారు.

ఐతే, ఉదాహరణకి రేపు మీ వ్యాపారం తగలడిపోయిందనుకుందాం. ఓఁ..అదొక అవకాశం, బీచులో పడుకోవటానికి, అడవిలో నడవటానికి, ప్రపంచం గురించి పట్టించుకోకుండా ఉండటానికి అదొక అవకాశం; కానీ మీరు దాన్ని అలా చూడరు, అంటే దానిలోని ప్రయోజనాన్ని చూడరు. మీరు దానిలోనూ నష్టాన్ని చూస్తారు. మీరు ఇలా ప్రతిదానిలోనూ నష్టాన్నే చూస్తారు.

మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ఎటువంటి పెట్టుబడి లేకుండా వచ్చారు, అవునా, కాదా? కాబట్టి మీ జీవితంలో ఏమైనా కూడా, మీరు లాభంలోనే ఉంటారు, అవునా, కాదా? ఏమైనా సరే మీరు నష్టపోలేరు.

మీరు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ఎటువంటి పెట్టుబడి లేకుండా వచ్చారు, అవునా, కాదా? కాబట్టి మీ జీవితంలో ఏమైనా కూడా మీరు లాభంలోనే ఉంటారు, అవునా, కాదా?

 ఈ జీవితం ఎలా సృష్టించబడిందంటే, మీరు ఎప్పుడూ నష్టపోలేరు. జీవితం ఎలా జరిగినా సరే మీరు లాభంలోనే ఉంటారు, నష్టంలో ఎప్పుడూ ఉండరు. కానీ మీరు ఎప్పుడూ మీ లాభాల గురించే ఏడుస్తూ ఉంటారు.

మీకు పెళ్ళవ్వకపోతే, ‘అయ్యో, నా జీవితంలో ఇంకా పెళ్లి లేదా?’ అని ఏడుస్తారు. పెళ్ళయిన వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో మీరు చూస్తున్నారా? మీకు తెలుసా, మీకు పెళ్ళయితే ఎప్పుడూ మీకు సరిజోడు కాని పురుషుడినో, స్త్రీనో పెళ్లి చేసుకుంటారు. అది ఎప్పుడూ అంతే. ఎందుకంటే, ప్రపంచంలో సరైన పురుషుడు, సరైన స్త్రీ అంటూ ఎవరూ ఉండరు. ఇంకా పెళ్లి అయిన తర్వాత, ఏదైనా జరిగి ఆ పెళ్లి పెటాకులయితే, ‘అయ్యో, నా పెళ్ళి పెటాకులయిందే!’ అని ఏడుస్తారు.

దయచేసి చూడండి, మీరు ప్రతిదానికీ ఏడవటం నేర్చుకున్నారు. సూర్యుడు ఉదయించి వాతావరణం వేడిగా ఉంటే, మీరు ఏడుస్తారు. సూర్యుడు అస్తమించి చీకటిగా ఉంటే, ఏడుస్తారు. చలికాలం చాలా చల్లగా ఉంటే,  ఏడుస్తారు. ఎండాకాలం చాలా వేడిగా ఉంటే,  ఏడుస్తారు. మీరు జీవిస్తున్న విధానాన్ని చూస్తే, మీరు హాయిగా ఉండే ఒకే ఒక చోటు మీ సమాధి అని నాకనిపిస్తోంది. మీరు మీ జీవితంతో హాయిగా ఉండలేరు. ఎందుకంటే మీరు జీవితంలో సహజంగా జరిగే విషయాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు.

మీ మానసిక దృక్పథం ఎలా ఉందంటే, మీరు జీవితంలోని సహజ ఘటనలు, అంటే పుట్టుక, మరణం వంటి వాటిని కూడా వద్దనుకుంటున్నారు. మీ వ్యవహారం ఎలా ఉందంటే, మీరు అసలు జీవితమే జరగవద్దని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మరి మీకు బాధ కాకుండా, ఆనందం ఎలా కలుగుతుంది? తప్పకుండా బాధే కలుగుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!” – సద్గురు.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *