మనస్సు మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ అదే మనస్సు మనకు ఎన్నోసార్లు బాధను కూడా కలిగిస్తుంది. దీనికి కారణం ఏమిటి? అసలు మనసు ఉన్నది ఎందుకు? ఆనందాన్ని కలిగించడానికా? బాధను కలిగించడానికా?  ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం  వ్యాసాన్ని చదవండి.


మీకు సరిగా ఉండడం అంటే ఏమిటో తెలియదు ఎందుకంటే మీ మనసు సరిగా లేదు. ఎక్కడైతే మనస్సు సరిగా ఉంటుందో, ఆక్కడ ఆనందం ఉంటుంది. సరి లేని మనసే మీకు అవసరం లేని దానిని సృష్టిస్తుంది. మీకు సరైన ఉన్న మనసు ఉంటే, అది మీకు అవసరం లేని దానిని సృష్టిస్తుందా? సరిగా లేకపోవటం అంటే మీ మనసు మీద మీకు నియంత్రణ లేకపోవటం, మీకు ఏమి కావాలో అది మీ మనసుకి చేయాలనిపించకపోవటం, అది దానికి నచ్చిన పిచ్చి పనులు చేయటం. జనాభాలోని చాలా శాతం మంది మీలాగే ఉన్నంత మాత్రాన, మీరు సరిగా ఉన్నట్లు కాదు. జనసమూహాలు ఎప్పుడూ కూడా మూర్ఖంగానే ఉంటాయి.

ఇప్పుడు, నేను చెప్పేదంతా మనసును నియత్రించడం గురించే అని మీరు అనుకోవచ్చు. నేను నియంత్రణ గురించి మాట్లాడటం లేదు. మీరు మీలోని సహజ ప్రక్రియలను యధాతధంగా జరగనిస్తే, ఆనందం ఒక్కటే మార్గం. ఇప్పుడు, ఉదాహరణకి, మీ భౌతిక శరీరం మీకు కావలసినట్లుగా పనిచేస్తేనే, అది మీకు ఉపయోగపడే పరికరం అవుతుంది. లేకపోతే అదొక మంచి శరీరం కాదు, అవునా, కాదా? అలాగే మనసు కూడా. నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటే అది నన్ను ఉండనివ్వాలి. నేను ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు, అది నాకు బాధను కలిగిస్తే, నేను స్ధిరంగా ఉండాలనుకున్నప్పుడు, నాలో అస్థిరతను కలుగజేస్తే, అది ఒక పిచ్చి మనసు, ఒక పనికిరాని మనసు అవుతుంది.

సరిగాలేని మనసే, మీకు అవసరం లేని దానినే సృష్టిస్తుంది. మీకు సరిగా ఉన్న మనసు ఉంటే, అది మీకు అవసరం లేని దానిని సృష్టిస్తుందా?

ప్రశ్న నియత్రణ గురించి కాదు. మీకు  సరిగా పనిచేసే మనసు ఉందా లేదా అన్నదే ప్రశ్న. మీ వద్ద ఉన్న కారు మీరు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళదనుకోండి, అప్పుడు దాని వల్ల ప్రయోజనం ఏమిటి? మీ వద్ద చక్రాలకు తాళం వేయబడ్డ కారు ఉందనుకోండి, అప్పడు అది మీరు ప్రయాణించటానికి ఉపయోగపడుతుందంటారా? అంటే, మీ నుండి సూచనలను తీసుకోకుండా, మీకు కావలసినదానిని సృష్టించకుండా, మీకు అక్కర్లేని పిచ్చి వాటినేవో సృష్టించే మనసు మీ వద్ద ఉంది. అలాంటి మనసులని పిచ్చి ఆసుపత్రులలో పెట్టాల్సింది. ఎందుకంటే అలాంటి మనస్సులు బయట చాలా ఉన్నాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.