ఈశా యోగా సెంటర్ – 2014 దసరా-నవరాత్రి వేడుకలు….!!!

dasara

ఈ సంవత్సరం ఈశా యోగా సెంటర్లో దసరా-నవరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరగనున్నాయి. దసరా సందర్భంగా ప్రత్యేకమైన పూజలు, శాస్త్రీయ సంగీత-నృత్య కచేరీలు, జానపద ప్రదర్సనలు జరుగుతాయి. భక్తులకు నవరాత్రి సాధనలో పాల్గొనే అవకాశం, అలాగే అధ్బుతమైన లింగ భైరవి ఊరేగింపు, నంది ముందు మహా హారతులను దర్శించే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 23 రాత్రి ‘మహాలయ అమావాస్య’ పర్వదినాన మరణించిన మన పూర్వీకుల, బంధువుల శ్రేయ్యస్సు కోసం చేసే వార్షిక కాలభైరవ శాంతితో ఈ ఉత్సవాలు మొదలవ్వనున్నాయి. తొమ్మిది రోజుల జరిగే నవరాత్రలు సెప్టెంబర్ 25న మొదలయ్యి అక్టోబర్ ౩న అంధకారంపై విజయం సాధించిన రోజైన ‘విజయదశమి’నాడు ముగుస్తాయి.

 మహాలయ అమావాస్య – సెప్టెంబర్ 23

6:00 PM     లింగ భైరవి వద్ద అగ్ని అర్పణ – అగ్నిలో నువ్వుల ముద్దలు/ ఉండలు సమర్పణ
8:30 PM      మహాలయ అమావాస్య గురించి  సద్గురు  వీడియో
11.20 PM    కాలభైరవ శాంతి

నవరాత్రి – సెప్టెంబర్ 25 – అక్టోబర్ ౩

సెప్టెంబర్ 25-27       దుర్గ రోజులు – కుంకుమ అభిషేకం
సెప్టెంబర్ 28-30        లక్ష్మి రోజులు  -హరిద్రం అభిషేకం
అక్టోబర్ 1-3              సరస్వతి రోజులు – చందన అభిషేకం

ఉదయం కార్యక్రమాలు:

7:00 – 7:30 AM                కుంకుమ/హరిద్రం/చందనం సమర్పణ

                                              ( సెప్టెంబర్25న, 28న మరియు అక్టోబర్ 1న)

7:40 AM                              ప్రతిరోజూ జరిగే అభిషేకం

సాయంత్రం కార్యక్రమం:

4:20 PM                                 గుడి తెరవబడుతుంది
5:45 PM – 6:45 PM              సూర్యకుండం మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమం
5:40 PM – 6:10 PM              లింగ భైరవి వద్ద నవరాత్రి పూజ
6:45 PM – 7:45 PM              లింగ భైరవి ఊరేగింపు, మహా హారతి
7:45 PM – 8:45 PM              లింగ భైరవి వద్ద నవరాత్రి సాధన
9:20 PM                                 గుడి మూసి వేయబడుతుంది

నవరాత్రి 2014 – సాంస్కృతిక కార్యక్రమ వివరాలు

తేది                                   కళాకారులు

25 సెప్టెంబర్ 2014        సంజుక్త వాఘ్ (కథక్)

26 సెప్టెంబర్ 2104        ప్రచి సాతి (భరత నాట్యం)

27 సెప్టెంబర్ 2104        సుజాత నాయర్ (మోహిని అట్టం)

28 సెప్టెంబర్ 2104        కావడి అట్టం – తప్పట్టం (జానపదం)

29 సెప్టెంబర్ 2104        జోత్స్న శివకుమార్ (కర్ణాటక సంగీత గానం)

30 సెప్టెంబర్ 2104        ప్రొఫెసర్ త్యాగరాజన్ (దేవి నవవర్ణాల మీద ప్రసంగం) –

                                     మధ్య మధ్యలో ఈశా సంస్కృతి పాటలు

1 అక్టోబర్ 2014              గ్రామీయ పాదల్ (జానపదం)

2 అక్టోబర్ 2014             జయశ్రీ అరవింద్ – వి.వి. రవి (వీణ-వయోలిన్ కచేరి) 

3 అక్టోబర్ 2014             తోల్ పావై కూతు (జానపదం)

 విజయ దశమి – అక్టోబర్ ౩ ( ప్రత్యేకమైన విద్యారంభం)

విజయానికి నిదర్శనమైన  విజయదశమి రోజున  పిల్లలు విద్య ఆరంభించటానికి, వారికి విద్యలో మద్దతు కొరకు ఒక ప్రత్యేకమైన విద్యారంభం చేయబడుతుంది.(2 – 12సంవత్సరాలు గల పిల్లలు పాల్గొనవచ్చు).

ఈ కార్యక్రమాలలో పాల్గొనటానికి మీకిదే మా ఆహ్వానం. మీరు ఈ వేడుకలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు లేదా  ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను వెబ్ ద్వారా వీక్షించి తరించవచ్చు.

ఈ వేడుకల ప్రత్యక్ష ప్రసారాలకు ఈ కింది లింకుని క్లిక్ చేయండి.

http://isha.sadhguru.org/live/

మరిన్ని వివరాలకి:

ఫోన్ : +91-8300030666+91-9486494865
ఈ-మెయిల్: info@lingabhairavi.org
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *